టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ తో కూడా భారి హిట్ కొట్టొచ్చు అని నాంది పలికిన పునాది ‘అర్జున్ రెడ్డి’. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.
భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసుకుని ప్రకటించడానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా రావడం, సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోవడం, దాంతో తలపట్టుకున్న సందీప్ వంగ ఇక లాభం లేదనుకొని ఈ లాక్ డౌన్ లో ఒక వెబ్ సిరీస్ సిద్ధం చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.