‘వార్ 2’: భారీ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ ఎంతవరకు? క్రేజీ డీటెయిల్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు భారీ సినిమాలు చేస్తుండగా వీటితో పాటుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో చేస్తున్న వార్ 2 లో కూడా తారక్ హృతిక్ తో సమాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సాలిడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఈ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాలీవుడ్ లో ఉన్నటువంటి క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ కూడా ఒకటి. వాటిలోనే వార్, పఠాన్, టైగర్ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఇపుడు ఎన్టీఆర్ కూడా అడుగు పెట్టేసరికి ఇది మరింత స్థాయిలోకి వచ్చింది. మరి ఈ యూనివర్స్ లో ఎన్టీఆర్ పాత్ర ఒక్క వార్ 2 తోనే ఆగిపోతుందా? అంటే లేదనే ఇపుడు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్టీఆర్ ఈ స్పై యూనివర్స్ లో ఒక్క వార్ 2 లోనే కాకుండా మిగతా ఇతర సినిమాల్లో కూడా కనిపించే ఛాన్స్ ఉందట. అంతే కాకుండా వీటికి మించిన క్రేజీ టాక్ ఏంటంటే తారక్ పైనే స్పెషల్ గా ఒక సెపరేట్ సినిమా కూడా ఉండే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ లో గట్టి ముద్రే వేసుకోబోతున్నాడని చెప్పడంలో సందేహం లేదు.

Exit mobile version