చివరికి సాయి పల్లవి కూడానా..!

ట్రెండ్ ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. డిజిటల్ యుగంలో ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దూసుకుపోతున్నాయి. దీనితో ప్రముఖ నటులు సైతం ఓ టి టి లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. హీరోయిన్స్ లో కీర్తి సురేష్, జ్యోతిక వంటి వారు ఓ టి టి లో చిత్రాలు విడుదల చేస్తున్నారు. కాగా ఇదే బాటలో సాయి పల్లవి కూడా నడవనున్నారట. సాయి పల్లవితో టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. సోషల్ బర్నింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ లో సాయి పల్లవి నటిస్తున్నారని సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కుతుండగా, సాయి పల్లవి తండ్రిగా ప్రకాష్ రాజ్ చేయనున్నారని సమాచారం.

దీనిపై అధికారిక ప్రకనట లేకున్నప్పటికీ కోలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు సాయి పల్లవి వెబ్ సిరీస్ లో నటించింది లేదు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకతంలో నాగ చైతన్యకి జంటగా, లవ్ స్టోరీలో నటిస్తుంది. ఆలాగే రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం మూవీలో కూడా సాయి పల్లవి నటిస్తున్నారు.

Exit mobile version