పుష్ప రాజ్ నెక్స్ట్ పై క్రేజీ బజ్!

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీతో ఒక పాన్ వరల్డ్ లెవెల్ స్టాండర్డ్స్ కలిగిన భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ లైనప్ లో మరిన్ని సినిమాలు ఉండగా వాటిలో త్రివిక్రమ్ తో అనుకున్న సినిమా లేనట్టే ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇది పక్కన పెడితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో భారీ సినిమా మాత్రం హోల్డ్ లో ఉంది.

కానీ ఈ సినిమా కూడా కాకుండా మరో సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టుగా ఇపుడు సమాచారం. అయితే ఇది వరకే నిర్మాత దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా ఉంటుంది అని టాక్ ఉంది. ఇక ఇదే సినిమాకి హీరోగా బన్నీని లాక్ చేసినట్టుగా ఇపుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version