అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్లో చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్రలో ఓ సీనియర్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ సీనియర్ హీరో ఎవరు అనేది చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఓ బాలీవుడ్ హీరోని ఆ అతిథి పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట.
కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట.