తలైవర్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ఇండియన్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్‌లో కూడా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మాసివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం 6.2 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ఇక ఈ సినిమా మున్ముందు మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.