బాక్సాఫీస్ దగ్గర తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ దుమ్ములేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక లాంగ్ వీకెండ్ రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో కూలీ చేస్తున్న ప్రభంజనం మామూలుగా లేదు. ఈ చిత్రం ప్రీమియర్స్‌తోనే సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 5.3 మిలియన్ మార్క్‌ను టచ్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కలెక్షన్స్ ఈ వీకెండ్ ముగిసే సరికి మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.