‘కూలీ’ రికార్డుల మోత.. అక్కడ ‘లియో’ లైఫ్ టైం వసూళ్లు అవుట్

‘కూలీ’ రికార్డుల మోత.. అక్కడ ‘లియో’ లైఫ్ టైం వసూళ్లు అవుట్

Published on Aug 17, 2025 11:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ చిత్రమే “కూలీ”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హైప్ నడుమ వచ్చి ఒకింత ఊహించని నెగిటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్ మాత్రం వసూళ్ల పరంగా ఇండియా నుంచి అమెరికా వరకు తుక్కు రేగ్గొడుతుంది. మరి కూలీ సినిమా ఈ టాక్ తో కూడా రికార్డు వసూళ్లు అందుకుంటుంది.

ఇక యూఎస్ మార్కెట్ లో అయితే లేటెస్ట్ గా 5.9 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని 6 మిలియన్ మార్క్ కి అతి చేరువ లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఈ మార్క్ తో నార్త్ అమెరికా మార్కెట్ లో విజయ్ లియో సినిమా లైఫ్ టైం వసూళ్లు కేవలం ఈ కొన్ని రోజుల్లోనే కొట్టేసినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం టాప్ 3 లో జైలర్, పొన్నియిన్ సెల్వన్ 1 ఇపుడు కూలీ సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ మార్క్ లో కూలీ ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.

తాజా వార్తలు