ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది.
నార్త్ అమెరికాలో ఈ చిత్రం అదిరిపోయే ప్రీమియర్ షో రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం ప్రీమియర్స్ ఏకంగా 3.04 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇది తమిళ సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది. రజినీ మేనియాతో బాక్సాఫీస్ ఊగిపోతుందని..ఇది కంటిన్యూ అయి సాలిడ్ వసూళ్లు రాబట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.