తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమా రజినీ లాస్ట్ చిత్రం ‘జైలర్ 2’ని ఫాలో అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ ఉన్నా, వారి పాత్రలకు సంబంధించి ఎలాంటి రివీల్ కూడా రిలీజ్‌కు ముందు చేయలేదు. ఇప్పుడు కూలీ కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో రజినీకాంత్ పాత్ర మినహా మిగతా ఏ పాత్ర కూడా ఎలాంటి రోల్ చేస్తుందా అనేది చెప్పకుండా దాచారు.
దీంతో ఈ సినిమాలో ఇంతమంది భారీ క్యాస్టింగ్ ఎలాంటి పాత్రల్లో సర్‌ప్రైజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.