తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ చిత్రం కూలీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ఓవర్సీస్‌లోనూ సాలిడ్ క్రేజ్ నెలకొంది.
ఈ సినిమాను చూసేందుకు అక్కడి అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపుతున్నారు. ఈ చిత్ర ప్రీమియర్స్‌ను ఆగస్టు 13న వేయనున్నారు. దీంతో అమెరికాలో ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున టికెట్ బుకింగ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
దీన్ని బట్టి చూస్తే, ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని.. ఇది సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.