టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’పై హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు జక్కన్న తెలపడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారని తెలిసిన తర్వాత హైప్ పీక్‌కి చేరింది.
ఇప్పటి వరకు పెద్ద సస్పెన్స్‌గా ఉన్న హనుమంతుడి ప్రేరణతో ఉన్న పాత్రను ఎవరు చేస్తారు అన్న ప్రశ్నకు జవాబు సిద్ధమైందన్న టాక్. ఆర్.మాధవన్ ఆ పాత్రకు ఫైనల్ అయ్యారట. హనుమంతుడి శక్తి, ఆధ్యాత్మికత వంటివి కలిగిన పాత్ర ఇది. మాధవన్‌తో కొన్ని సీన్లు ఇప్పటికే చిత్రీకరించారన్న సమాచారం ఉంది. అయితే, ఆయన నిజంగానే హనుమంతుడి పాత్రకు సూట్ అవతారా..? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు తండ్రి పాత్రకు మొదట నానా పటేకర్‌ను అనుకున్నప్పటికీ, ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. కొత్త సీనియర్ నటుడిని ఫైనలైజ్ చేస్తున్నారట. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో అంతర్జాతీయ నటి కూడా సినిమాలో ఉండే అవకాశం ఉంది.
