ప్రస్తుత రోజుల్లో కృతిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏ రకంగా పరిణామం చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో దీని వినియోగం విరివిగా పెరుగుతూ వస్తుంది. ఇక ఇదే ఏఐ తో అనేకమంది ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా తమ సృజనాత్మక ఆలోచనలకి జీవం పోస్తున్నారు.
ఇప్పుడు వరకు పలు షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న క్లిప్స్ లాంటివి వచ్చాయి కానీ బాలీవుడ్ నుంచి ఒక పూర్తి ఏ ఐ సినిమా అది కూడా హనుమంతునిపై తెరకెక్కించినట్టు కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం లు నిర్మాతలుగా “చిరంజీవి హనుమాన్” పేరిట ఓ యానిమేషన్ తరహా ఏఐ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్స్ లో హనుమాన్ జయంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.