త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, అబ్బూరి రవి – టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ రైటర్. అబ్బూరి రవి తాజాగా డైలాగ్స్ రాసిన ‘ఎవడు’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘కేరింత’ సినిమాకి పనిచేస్తున్న అబ్బూరి రవి తనకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనకు మార్గ నిర్దేశకుడని చెబుతున్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నాకు సినిమా రంగం గురించే తెలియనప్పుడు నాకు సినిమా అంటే ఏంటో నేర్పింది త్రివిక్రమ్. నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది, మార్గ నిర్దేశం చేసింది త్రివిక్రమ్. అందుకే త్రివిక్రమ్ లేకపోతే అబ్బూరి రవి లేడు. చాలా సార్లు నన్ను త్రివిక్రమ్ తో పోలుస్తూ ఆర్టికల్స్ రాసేవాళ్ళు కానీ అతనితో పోల్చేంత స్థాయి నాకు లేదని’ అబ్బూరి రవి అన్నాడు.