భారీ రేటుకి అమ్ముడు పోయిన రాంబాబు కృష్ణా రైట్స్

మాకు ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర కృష్ణా జిల్లా రైట్స్ మంచి ఫాన్సీ అమౌంట్ కి అమ్ముడు పోయాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ వారు 2.25 కోట్లకి ఈ చిత్ర కృష్ణ జిల్లా రైట్స్ దక్కించుకున్నారు. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ అక్టోబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ రాత్రి పగలు తేడా లేకుండా డబ్బింగ్ చెప్పారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో పవన్ ఒక పవర్ఫుల్ టీవీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. నిన్న విడుదల చేసిన థియేటర్ ట్రైలర్లో వదిలిన పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version