మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు అనారోగ్యంగా ఉందని సాయంత్రం నుండి కొన్ని వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. అవి చూసిన మెగా ఫ్యాన్స్ అసలే కరోనా టైమ్ కావడంతో తేజ్‌కు ఏమైందో ఏమోనని తెగ గాబరాపడిపోతున్నారు. తేజ్ కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. దాంతో ధరమ్ తేజ్‌కు ఆరోగ్యం సరిగా లేదని, అందుకే డబ్బింగ్ పనులను వాయిదా వేశారని ప్రచారం మొదలైంది. కానీ తేజ్ ఆరోగ్యానికి ఏమీ కాలేదు. అయన బాగానే ఉన్నారు.
ఆయన తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు దేవ కట్టతో కలిసి కొత్త ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నారాయన. తేజ్ తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను విన్నారో ఏమో కానీ వెంటనే దేవ కట్టతో కలిసి ప్రీప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్న ఫొటో ఒకదాన్ని షేర్ చేసి 14వ సినిమా ముందస్తు పనుల్లో ఉన్నామని, దేవ కట్ట కథను గొప్పగా రాశారని, సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన అనారోగ్యంగా ఉన్నారనే పుకార్లకు ఫులుస్టాప్ పడినట్లయింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. సినిమా ఏలూరు నేపథ్యంలో నడిచే పొలిటికల్ డ్రామా అని, ఇందులో తేజ్ డాక్టర్ పాత్రలో కనిపిస్తాడని, ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేయనున్నారనే టాక్ ఉండగా అఫీషియల్ కనర్మేషన్ అందాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.