క్రేజీ తమిళ్ డైరెక్టర్ కి నో చెప్పిన సినిమాటోగ్రాఫర్


స్వతహాగా తమిళ్ డైరెక్టర్ అయిన ఎ.ఆర్ మురుగదాస్ ఒక్క కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ మరియు బాలీవుడ్లో కూడా సినిమాలు చేసి తన టాలెంట్ ని నిరూపించుకున్నారు. మురుగదాస్ కి సౌత్ ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అంటే చాలా ఇష్టం. తన మొదటి సినిమా నుంచి తనని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న మురుగదాస్ కి ఆ కోరిక ఇటీవల విజయ్ తో తీసిన ‘తుపాకి’ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై తమిళ మరియు తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మురుగదాస్ ఈ సినిమాని బాలీవుడ్లో అక్షయ్ కుమార్ తో రిమేక్ చేయనున్నాడు.

హిందీ వెర్షన్ కి కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేయమని సంతోష్ శివన్ ని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలాగే ఆయన సినిమాటోగ్రఫీ కొంచెం పక్కన పెట్టి తను డైరెక్టర్ గా తీయాలనుకుంటున్న సినిమాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పడంతో మురుగదాస్ చేసేదేమీ లేక సరే అన్నాడు.

Exit mobile version