కరోనా ఎఫెక్ట్.. నెల్లూరులో థియేటర్లు బంద్

కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఇప్పటికే వైరస్ కారణంగా విదేశాల్లో షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. ఫలితంగా సినిమాల విడుదల వెనక్కు వెళ్ళే పరిస్ఠితి. ఇవి చాలవన్నట్టు థియేటర్లు కూడా మూతవేసే పరిస్ఠితులు నెలకొన్నాయి. ఇటీవలే నెల్లూరులో ఇటలీ నుండి వచ్చిన విద్యార్థికి కరోనా లక్షణాలు బయటపడిన సంగతి తెలిసిందే.

అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య శాఖ కరోనా ఉన్నట్టు తేల్చాయి. నగరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా నగరంలోని సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో టౌన్లోని థియేటర్లన్నీ రెండు రోజుల పాటు మూతబడ్డాయి. ఈ పరిణామంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు ఇరుకునపడ్డారు. వీలైనంత త్వరగా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Exit mobile version