మనవరాలితో మెగాస్టార్ ఇంట్రస్టింగ్ వీడియో !

మనవరాలితో మెగాస్టార్ ఇంట్రస్టింగ్ వీడియో !

Published on Apr 28, 2020 10:46 AM IST

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ.. నిన్న ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. నేను ఈ మధ్య ఒక పాటను మాత్రం పాజ్ చేస్తూ… మళ్లీ ఫస్ట్ నుండి పెట్టుకుంటూ ఆ సాంగ్ ను మళ్ళీ మళ్లీ ఎంజాయ్ చేస్తున్నానని.. దానికి కారణం.. ఈ ఉదయం చెబుతాను’ అని నిన్న చెప్పినట్లుగానే… చిరు ఈ ఉదయం ఒక ఇంట్రస్టింగ్ వీడియోతో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు.

కాగా వీడియోలో, చిరు తన మనవరాలు నవిష్కాతో కలిసి ‘ఖైదీ నెం 150’లోని యు అండ్ మీ ఫుల్ వీడియో సాంగ్ ను ప్లే చేస్తూ సరదగా గడిపారు, ముఖ్యంగా నవిష్కా యు అండ్ మీ సాంగ్ కావాలని తాతను పట్టుపట్టడం, చిరు కూడా నవిష్కాతో పాటు సాంగ్ వింటూ సరదాగా గడపటం ఫ్యాన్స్ కు బాగా ఆసక్తిని కలిగిస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాట‌ను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు