చెప్పినట్లే సూపర్ డాన్స్ వీడియోతో వచ్చిన చిరు..!

ఏప్రిల్ 29న వరల్డ్ డాన్స్ డే సందర్భంగా చిరంజీవి డాన్స్ తో తనకు గల అనుభందాన్నీ, డాన్స్ వలన తనకు దక్కిన గౌరవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. డాన్స్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరు ఇప్పటికి కూడా తాను ఒత్తిడి ఫీలైన సందర్భాలలో తన రూంలోకి వెళ్లి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసి ఉపశయమం పొందుతానని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆయన తన రీసెంట్ డాన్స్ పెరఫార్మెన్సు ఒకటి మీతో పంచుకుంటాను అని ఆయన చెప్పడం జరిగింది.

ఐతే అదే రోజు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకస్మాత్తుగా మరణించడంతో చిరు ఆ డాన్స్ వీడియో విడుదల ఆపివేశారు. కాగా నేడు ఆయన సోషల్ మీడియాలో ఓ ఆసక్తిగొలిపే డాన్స్ వీడియో పంచుకున్నారు. 80’స్ హీరోయిన్స్ అయిన సుహాసిని, కుష్బూ, రాధా, రాధికా, జయప్రద వంటి హీరోయిన్స్ తో ఆయన డాన్స్ చేసిన వీడియో ఆయన పంచుకున్నారు. ప్రతి ఏడాది 80స్ క్లబ్ పేరుతో అప్పటి హీరో హీరోయిన్స్ రీయూనియన్ అవుతూ ఉంటారు. ఈ ఏడాది జరిగిన రీ యూనియన్ లో చిరు డాన్స్ వేసిన వీడియోనే అది.

https://twitter.com/KChiruTweets/status/1256901001761533952?s=20

Exit mobile version