మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలుగా తెరకి పరిచయమయ్యారు. ఆ హీరోల జాబితాలో త్వరలోనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా చేరనున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా రేపు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
ఈ మూవీ లాంచ్ కార్యక్రమాన్ని మా టీవీ వారు లైవ్ కూడా ఇవ్వనున్నారు. హీరో, డైరెక్టర్ తప్ప మిగిలిన నటీనటుల, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే గోదావరి జిల్లాల నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం.