మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ సామజిక అంశానికి ప్రస్తావిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవుతుండగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఐతే ఇటీవల చిరంజీవి ఓ కార్యక్రమంలో పొరపాటున చిత్ర టైటిల్ ఆచార్య అంటూ లీక్ చేశేశారు. ఈ నేపథ్యంలో చిరు సినిమా టైటిల్ మారనుందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ నెల 25న ఉగాది కానుకగా టైటిల్ మరియు చిరు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో ఉగాది రోజున చిరు మూవీ టైటిల్ పై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.