చిరు ఐకానిక్ మూవీకి సీక్వెల్ ఉంది-అశ్వినీ దత్

స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్వినీ దత్. ఈ మూవీ సీక్వెల్ ఉంటుందన్న ఆయన త్వరనే వివరాలు వెల్లడిస్తాం అని చెప్పారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను రామ్ చరణ్, జాన్వీ కపూర్ లతో సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో ప్రేక్షకులు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.

1990లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఓ ఫాంటసి కథతో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీదేవి దేవకన్య పాత్ర చేయడం విశేషం. ఈ మూవీ విడుదలై 30ఏళ్ళు అవుతున్న సంధర్భంగా ఆ సినిమా విశేషాలు ఒక్కొక్కటీ చిత్ర బృందం పంచుకుంటున్నారు.

Exit mobile version