‘ఓజి’ పై మెగాస్టార్ సాలిడ్ రివ్యూ

‘ఓజి’ పై మెగాస్టార్ సాలిడ్ రివ్యూ

Published on Sep 30, 2025 11:08 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఓజి” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమా స్పెషల్ షోని మెగాస్టార్ చిరంజీవి అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు నిన్ననే వీక్షించిన సంగతి తెలిసిందే. మరి షో తర్వాత మెగాస్టార్ తన సాలిడ్ రివ్యూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరి మెగాస్టార్ ఓజి విషయంలో చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. ఓజి సినిమాని తన ఫ్యామిలీ మొత్తంతో చూడడం జరిగింది అని సినిమాలో ప్రతీ బిట్ ని ఎంజాయ్ చేసానని చిరు తెలిపారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఒక డిఫరెంట్ ఉండే వరల్డ్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ డ్రామాని మంచి ఎమోషన్స్ ని కూడా పెట్టి చేయడం బాగుందని కొనియాడారు. దర్శకుడు సుజీత్ మొదటి నుంచి చివరి వరకు సినిమాని ఎక్స్ట్రార్డినరీగా తీసుకెళ్లారని తనకి కంగ్రాట్స్ తెలిపారు.

అంతే కాకుండా కళ్యాణ్ బాబుని స్క్రీన్ పై ఆ స్వాగ్ లో చూడడం ఎంతో ఆనందంగా అనిపించింది అని ఇది తన ఫ్యాన్స్ కి కూడా ఫీస్ట్ అని తెలిపారు. ఇక థమన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టేసాడని రవి కే చంద్రన్ ఎక్సలెంట్ కెమెరా కెమెరా వర్క్ చూపించారని తాను తెలిపారు. వీరితో పాటుగా సినిమాకి వర్క్ చేసిన ప్రతీ ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు అని నిర్మాత డీవీవీ దానయ్యకి శుభాకాంక్షలు తాను తెలియజేసారు. ఇక దీనితో చిత్ర యూనిట్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు