కొరటాల చిరును అలా చూపించనున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ నుండి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాక చక చకా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్ గా దశాబ్దాలు వెండి తెరను ఏలిన చిరంజీవి సైరా వంటి పాన్ ఇండియా మూవీ కూడా చేయడం విశేషం. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతో మూవీ చేస్తున్నారు. కోవిడ్19 వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కి స్వల్ప విరామం ప్రకటించడం జరిగింది. ఈ చిత్రంలో చిరంజీవి రోల్ చాల స్పెషల్ గా మరియు సరికొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

అలాగే చిరంజీవి తన వయసుకు దగ్గరగా కొంచెం మిడిల్ ఏజ్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే చిరు పిక్ ఒకటి లీక్ కాగా ఆయన సోషల్ భావాలు కలిగిన ఆక్టీవిస్ట్ లా కనిపించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version