‘రేసు గుర్రం’ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధి గా చిరంజీవి

‘రేసు గుర్రం’ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధి గా చిరంజీవి

Published on Mar 15, 2014 5:35 PM IST

race-gurram-audio-launch

మెగాస్టార్ చిరంజీవి ‘రేసు గుర్రం’ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధి గా వ్యవహరించనున్నారు. మార్చి 16 న హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో రిలీజ్ అభిమానుల నడుమ కాకుండా సింపుల్ గా జరగనుంది.

అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమలుపు బుజ్జి మరియు డా. వెంకటేశ్వరరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందిన సమాచరం ప్రకారం థమన్ ఈ చిత్రానికి అల్లు అర్జున్ అభిమానుల్ని ఆకట్టుకునే మాస్ బాణీలని సమకూర్చాడు. ఈ చిత్రం లో మూడు పాటలు ఇప్పటికే మంచి ఆదరనని పొందుతున్నాయి. ముఖ్యంగా శృతి హసన్ పాడిన ‘డౌన్ డౌన్ డౌన్ దుప్పా’ ‘స్వీటీ’, ‘బూచాడే’ పాటలకి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఇది ఇలా వుండగా శృతి హసన్ దుబాయ్ లో జరుగుతున్న ఒక హింది చిత్రం ‘వెల్కం బ్యాక్’ షూటింగ్ లో బిజీ గా వుండడం వల్ల ఈ ఆడియో రిలీజ్ కి రాలేనని తెలిపింది. సలోని రవి కిషన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘రేసు గుర్రం’ త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు