కొరటాల మూవీ షూట్ హోల్డ్ లో పెట్టిన చిరు.

కొరటాల మూవీ షూట్ హోల్డ్ లో పెట్టిన చిరు.

Published on Mar 15, 2020 9:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణా గవర్నమెంట్ ఇప్పటికే విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్ వంటి వాటిని ఈనెల 31వరకు బంధ్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, చిరంజీవి సైతం తన మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక సినిమా కంటే ప్రజారోగ్యమే ప్రధానం అని ఆయన చెప్పడం జరిగింది.

చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సామజిక భావాలు కలిగిన విప్లవ వీరుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఆచార్య అనే టైటిల్ తో రానున్నట్లు ప్రచారం జరుగుతుండగా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు