కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరవనున్న మెగాస్టార్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరవనున్న మెగాస్టార్

Published on May 19, 2013 1:50 PM IST

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచంలోని ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలని కలిసారు, అలా కలిసి వారిని ఇండియాలో సినిమాలు చేయడానికి ఆహ్వానించారు. టూరిజం యూనియన్ మినిస్టర్ గా చిరంజీవి కేన్స్ కి హాజరయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో ఇండియాలో సినిమాలు తీయడానికి సింగల్ విండో క్లియరెన్స్ అనే విధానాన్ని లాంచ్ చేసారు. దీని ద్వారా సినిమాకి కావాల్సిన అన్ని అనుమతులకు ఒకేసారి అనుమతిస్తారు.

ఇటీవలే చిరంజీవి గారు మాట్లాడుతూ ‘ టూరిజం మినిస్ట్రీ పర్ఫెక్ట్ ‘ఫిల్మ్ టూరిజం’ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. మనం అనుకున్నది సాదించడానికి, దేశంలో డెవలప్ మెంట్ కి పవర్ఫుల్ ఆయుధం సినిమా అనే దాన్ని మన దేశం ప్రమోట్ చేస్తోందనే’ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేన్స్ తర్వాత ఇదే విధానాన్ని పలు ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రచారం చేయనున్నారు.

తాజా వార్తలు