పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌తో ఒక్కసారిగా వీరమల్లు చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. పవన్ అభిమానులు సైతం ఊహించని లెవెల్లో ఈ చిత్ర ట్రైలర్ కట్ అదిరిపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ ఇంపాక్ట్ చూపెడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ హరిహర వీరమల్లు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. ఇలాంటి పవర్ఫుల్ ట్రైలర్ కట్ చూసి చాలా రోజులు అయిందని ఆయన కామెంట్ చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై ఫైర్ పుట్టించాడు అంటూ చిరు కామెంట్ చేశారు. ఈ సినిమాను అందరితో పాటు తాను కూడా ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై వీక్షిస్తానా.. అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు చిరు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.
ఇక పవర్ స్టార్ వీరమల్లు ట్రైలర్‌కు మెగాస్టార్ ఫిదా కావడంతో, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ట్రైలర్తోరే ఇంత అగ్గి రాజేసిన పవన్ కళ్యాణ్ ఇక సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
What an electrifying trailer !! ❤️????
Absolute delight to see Kalyan babu @PawanKalyan setting movie screens on fire after almost 2 years.
Wishing the Very Best to Team #HariHaraVeeraMallu ????#HHVMonJuly24th @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 3, 2025