మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. మెగాస్టార్ కెరీర్ 157వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఉంది. ఇక అనీల్ ఆల్రెడీ తన మార్క్ ప్రమోషన్స్ ని కూడా చేస్తుండగా ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లింప్స్ ఇంకా ఫస్ట్ లుక్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
దీని ప్రకారం మెగాస్టార్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లు ఈ ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా అందిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మెగా అభిమానులకి బాగా కనెక్ట్ అయ్యే సూపర్ టైటిల్ ని అనీల్ లాక్ చేశారట. మరి అదేంటి అనేది తెలియాలి అంటే ఈ 22 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.