ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 6, 2025
స్ట్రీమింగ్ వేదిక : జీ5
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : శ్రియా పిల్గౌన్కర్, కామ్య అహ్లావత్, రాగిణి ద్వివేది, తుహీనీ దాస్, యహ్వీ శర్మా తదితరులు
దర్శకుడు : అజయ్ భుయాన్
నిర్మాతలు : ఆదిత్యా పిట్టీ, సమర్ ఖాన్
సంగీత దర్శకుడు : సౌత్రిక్ చక్రబర్తి
సినిమాటోగ్రాఫర్ : షాను సింగ్ రాజ్‌పుత్
ఎడిటర్ : రాజ్‌కుమార్ చతుర్వేది
సంబంధిత లింక్స్ : ట్రైలర్
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ‘ఛల్ కపట్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్రీమింగ్ అవుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
అలీషా దీక్షిత్(కామ్య అహ్లావత్) పెళ్లి కోసం ఆమె స్నేహితురాళ్లు మెహక్(రాగిణి ద్వివేది), ఇరా(తుహినీ దాస్), షాలు(యాహ్వీ శర్మ) హాజరవుతారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన షాలు అనుమానస్పదంగా మృతి చెందుతుంది. దీంతో ఈ కేసును డీల్ చేసేందుకు వచ్చిన ఎస్పీ దేవిక రాథోడ్(శ్రియా పిల్గౌన్కర్) ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది..? ఆమెకు ఈ కేసు పరిష్కారంలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి..? ఇంతకీ షాలుది ఆత్మహత్య లేక మర్డరా..? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు కావాల్సిన కోర్ పాయింట్ ఈ వెబ్ సిరీస్‌లోనూ మనకు కనిపిస్తుంది. ఓ హత్య వెనకాల ఉన్నది ఎవరనే దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్సులు కూడా ఓకే.
అటు థ్రిల్లర్ సీన్స్‌ను ఎలివేట్ చేసేలా వచ్చే బీజీఎం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్‌తో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తారు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లకు కథను హ్యాండిల్ చేసే విధానం ప్రధాన బలం. కానీ, ఇందులో కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయదు. ముఖ్యంగా కోర్ పాయింట్ చుట్టూ తిరిగే ఘటనలను ఆయన ఇంకాస్త పర్ఫెక్ట్గా చూపెట్టాల్సింది.
ఇక సస్పెన్స్ అంశాలను కూడా పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ, ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ లేకుండా చాలా రొటీన్‌గా ఈ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ సీన్స్ సాగుతాయి. అటు కథను సరిగ్గా హ్యాండిల్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు.
ఇలాంటి వెబ్ సిరీస్‌లకు ప్రాణం స్క్రీన్ ప్లే. కానీ, ఇందులో స్క్రీన్ ప్లేను గాలికొదిలేశారని ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి ఎంగేజింగ్ అంశం లేకపోవడంతో ప్రేక్షకులకు ఇది పెద్దగా నచ్చదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు అజయ్ భుయాన్ ఈ వెబ్ సిరీస్‌ను హ్యాండిల్ చేసిన విధానం ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఎంగేజింగ్ అంశాలను పక్కకు పెట్టి కేవలం సస్పెన్స్ అంశాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌కు స్క్రీన్ ప్లే మేజర్ డ్రా బ్యాక్. ఆకట్టుకునే నెరేషన్ లేకపోవడంతో ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అవుతారు. ఎడిటింగ్ వర్క్ చాలా బెటర్‌గా ఉండాల్సింది. మ్యూజిక్ పరంగా నేపథ్య సంగీతం పర్వాలేదనిపించింది. ఇక నిర్మాణ విలువలు ఓకే. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు :
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన ఛల్ కపట్ వెబ్ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలం అయ్యిందని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్‌లో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంలో మేకర్స్ తడబడ్డారు. ఏదైనా థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునే వారు ఈ సిరీస్‌ను ట్రై చేయవచ్చు. మిగతా ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్‌ను స్కిప్ చేసి వేరొక ఆప్షన్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team