కిక్ సినిమాలో దొంగ రవితేజను వెంటాడే పోలీసు పాత్ర చేసిన నటుడు శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన చెన్నైలోని ఓ ప్రాంతంలో నిబంధనలు విరుద్ధంగా ఓ క్లబ్ నడపడమే దీనికి కారణంగా తెలుస్తుంది. పోకర్ గేమ్ పేరుతో ఓ క్లబ్ నడుపుతున్న శ్యామ్, గ్యాంబ్లింగ్ నడుపుతున్నారన్న ఆరోపణలతో ఆయన అరెస్ట్ జరిగినట్లు తెలుస్తుంది. శ్యామ్ అరెస్ట్ కోలీవుడ్ వర్గాలలో సంచలనంగా మారింది.
కిక్ సినిమాలో సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో కనియించిన శ్యామ్, దర్శకుడు సురేంధర్ రెడ్డితో ఎక్కువ సినిమాలు చేశారు. సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన ఊసరవెల్లి, రేసుగుర్రం సినిమాలలో కూడా ఆయన కీలక రోల్స్ చేయడం జరిగింది. కన్నడ నటుడైన శ్యామ్ తెలుగు మరియు తమిళ భాషలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు.