మోహన్ బాబుకి అండగా చెన్నై బ్రాహ్మణులు


డా. మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమా విడుదలైనప్పటి నుంచి బ్రాహ్మణుల గురించి చెడుగా చూపించారని బ్రాహ్మణులు సినిమాకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పడానికి మోహన్ బాబుకి మద్దతుగా చెన్నై మరియు తమిళనాడు నుండి కొంత మంది బ్రాహ్మణులు హైదరాబాద్ వచ్చారు. వారందరూ ఈ రోజు మోహన్ బాబు ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.

వారందరూ మాట్లాడుతూ ‘ మోహన్ బాబు గారు అందరికీ మర్యాద ఇచ్చే మనిషి, ఆయన ఎప్పుడూ బ్రాహ్మణులకు వ్యతిరేకి కాదు. ఆయన మా కమ్యూనిటీలకు మరియు మాకు ఎంతో గౌరవం ఇస్తారు. అలాంటి ఆయన బతికుండగానే పిండ ప్రధానం చేయడం చాలా తప్పు. ఆయనపై ఉన్న చెడు వార్తలని తొలగించడానికే మేము మీడియా ముందుకు వచ్చామని’ అన్నారు.

Exit mobile version