ఖరారైన రామ్ చరణ్ ఎవడు రిలీజ్ డేట్

ఖరారైన రామ్ చరణ్ ఎవడు రిలీజ్ డేట్

Published on Jul 16, 2013 4:13 PM IST

Yevadu1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ముందుగా చెప్పినట్టు మగధీర సినిమా రిలీజ్ అయిన రోజే అనగా జూలై 31న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని రికార్డ్ స్థాయి థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. జూలై మాసం మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది దాంతో ప్రొడక్షన్ టీం మళ్ళీ ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు