మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘తుఫాన్’ ఆడియో సమాచారం ప్రకారం ఈ నెల 21న విడుదలకానుంది. ఈ వేడుక తేదిను అధికారికంగా మరికొన్నిరోజులలో ప్రకటిస్తారు
బాలీవుడ్ ‘జంజీర్’కు ‘తుఫాన్’ తెలుగు వెర్షన్. ఈ సినిమా అమితాబ్ ను అలనాటి యాంగ్రీ యంగ్ మాన్ గా చూపించిన ‘జంజీర్’కు రీమేక్.
అపూర్వ లిఖియా దర్శకుడు. తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్. ‘తుఫాన్’ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా మరియు ఫ్లైయింగ్ టర్టిల్స్ సంస్థ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాషల్లోనూ సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతుంది