ఎవడు చిత్రీకరణలో పాల్గొంటున్న రామ్ చరణ్

ఎవడు చిత్రీకరణలో పాల్గొంటున్న రామ్ చరణ్

Published on Jan 24, 2013 4:04 AM IST

Ram-Charan-Teja
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ “ఎవడు” చిత్రీకరణలో తిరిగి పాల్గొంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ ఒక వారం నుండి జరుగుతున్నట్టు సమాచారం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హసన్ కథానాయికగా రామ్ చరణ్ సరసన నటిస్తుంది. గతంలో ఈ పాత్రని సమంత చెయ్యవలసి ఉండగా ఆ స్థానంలో శృతి హసన్ ని ఎంపిక చేసుకున్నారు. ఏమి జాక్సన్ రెండవ కథానాయికగా కనిపించనున్నారు.

అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మర్డర్ మిస్టరీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

తాజా వార్తలు