అల్లూరి బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందో చూపిస్తాడట.

అల్లూరి బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందో చూపిస్తాడట.

Published on May 7, 2020 2:29 AM IST

రాజమౌళి హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజుల కథలకు కాల్పినికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో నటించడానికి రామ్ చరణ్ ప్రొఫెషనల్ బాక్సర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రముఖ బాక్సర్ కుల్దీప్ సింగ్ , రామ్ చరణ్ కు బాక్సింగ్ లో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.

దీనితో అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులపై పిడిగుద్దులు కురిపించడం ఖాయం అని తెలుస్తుంది. మరి చరణ్ కి ఈ బాక్సింగ్ ఫైట్ సన్నివేశాలు రాజమౌళి ఎలా సెట్ చేశారు అనేది ఆసక్తికరం. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆయన ఫస్ట్ లుక్ వీడియో విడుదల కానుంది. ఆయన ఫ్యాన్స్ ఆ వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు