ఫిబ్రవరి మొదటి వారం నుంచి రామ్ చరణ్ మూవీ

ఫిబ్రవరి మొదటి వారం నుంచి రామ్ చరణ్ మూవీ

Published on Jan 22, 2014 8:10 AM IST

Ram-Charan,-Srikanth-and-KV
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో త్వరలోనే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6 నుంచి మొదలు కానుంది. అలాగే ఈ సినిమాకి ‘గోవిందుడు అందరి వాడెలే’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ మూవీలో హీరో శ్రీ కాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ కాంత్ కి జోడీగా కమలినీ ముఖర్జీ కనిపించనుంది. ప్రీ ప్రొడక్షన్ మొట్ట పూర్తి చేసుకున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు