ఆగష్టు నుంచి చరణ్ – కొరటాల శివ మూవీ

ఆగష్టు నుంచి చరణ్ – కొరటాల శివ మూవీ

Published on Jul 11, 2013 8:42 AM IST

ram-charan-koratala-siva-s-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా జూలై నుండి మొదలు కావాలి కానీ ఈ సినిమా ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దీని కోసం ఆగష్టు 22వ తేదీని ఖరారు చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎవడు’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చరణ్ – కొరటాల శివ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కేథరిన్ ఎంపిక కాగా మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ఈ సినిమా పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో తను రాసే డైలాగ్స్ కి, అలాగే హీరోని ఎలివేట్ చేసే సీన్స్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొరటాల శివ డైరెక్టర్ గా రెండవ సినిమా చరణ్ తో చేస్తున్నాడు.

తాజా వార్తలు