మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్టిమేట్ రియాలిటీ షో ‘అదుర్స్ 2’ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్లో రానున్నారు. రేపు ఈటివిలో రాత్రి ప్రదర్శితం కానున్న ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబుతో కలిసి రామ్ చరణ్ ఈ ప్రోగ్రాంలో కనిపించనున్నాడు. అదుర్స్ 2 ఈటివిలో ప్రదర్శితమవుతున్న ప్రముఖ రియాలిటీ షో. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారు ఈ షోని నిర్వహిస్తున్నారు. 123తెలుగు.కాం కూడా మల్లెమాల సంస్థ వారు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే సంస్థ నుండి వచ్చిన ‘ఢీ’ అనే రియాలిటీ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కలిసి వచ్చాడు.