‘మూడ్ ఆఫ్ తమ్ముడు’.. పాత్రల పరిచయం అయ్యింది!

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంటున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలోని పాత్రలను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ సాగింది. అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన సంగీతంతో ఈ మూడ్ ఆఫ్ తమ్ముడు గ్లింప్స్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో రత్న అనే పాత్రలో సప్తమి గౌడ, కుట్టి అనే పాత్రలో శ్వాసిక, అగర్వాల్ అనే పాత్రలో సౌరభ్ సచ్‌దేవ, చిత్ర అనే పాత్రలో వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయి పాత్రలో లయ, జయ్ అనే పాత్రలో హీరో నితిన్ నటిస్తున్నారు.

ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ మేజర్ బలంగా ఉండబోతున్నట్లు ఈ మూడ్ ఆఫ్ తమ్ముడు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని జూలై 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version