‘హరిహర వీరమల్లు’లో క్రిష్ వర్క్ కి మార్పులు?

‘హరిహర వీరమల్లు’లో క్రిష్ వర్క్ కి మార్పులు?

Published on Jul 9, 2025 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో మొదలైన సినిమా యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. అయితే పవన్ నుంచి మొదటి హిస్టారికల్ పీరియాడిక్ సినిమాగా ఇది అనౌన్స్ అయ్యి ఇప్పుడు ఎట్టకేలకి రిలీజ్ కి వస్తున్న సినిమా విషయంలో మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. క్రిష్ ఒక విజన్ తో మొదట్లో సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇందులో కూడా చాలా అంశాలకి జ్యోతికృష్ణ మార్పులు చేర్పులు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది వరకు క్రిష్ పూర్తి చేయని భాగం వరకు భాద్యతలు జ్యోతి తీసుకున్నాడని వినిపించింది కానీ ఇప్పుడు ఏకంగా తన వర్క్ లోనే మార్పులు చేశారు అనేది ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పి తీరాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 24న గ్రాండ్ గా విడుదల కాబోతుండగా ఈ డేట్ కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు