చందమామ కధలు తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది: మంచు లక్ష్మి

చందమామ కధలు తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది: మంచు లక్ష్మి

Published on Apr 9, 2014 3:49 AM IST

Manchu-Laxmi
ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న చందమామ కధలు సినిమా ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రేక్షకుల స్పందన గురించి ఈ చిత్ర బృందం ఎంతగానో ఎదురుచూస్తుంది. కొన్ని విభిన్న కధనాలను కలగలిపిన సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ సినిమాను పంపిణీ చేయనున్న అనీల్ సుంకర మాట్లాడుతూ “దర్శకుడు ఈ సినిమాను అమోఘంగా మలిచాడు. ఈ సినిమాను రాష్ట్రంలో విడుదలచేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ నేల 19న ప్రిమియర్ వేయనున్నాం” అని అన్నారు. ఈ చిత్రంలో ఎక్స్ మోడల్ పాత్ర పోషించిన మంచు లక్ష్మి మాట్లాడుతూ “ఇటువంటి సినిమాలో భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకుడి మేధస్సుకి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా తెలుగు చిత్ర సీమలో ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని చెప్పింది

ఈ సినిమాలో చైతన్య కృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, అభిజీత్, షామిలి, ఇషా, కిషోర్ మరియు రిచా పనై ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు

తాజా వార్తలు