8 అసమానతలని సమానంగా పొందుపరచిన ‘చందమామ కథలు’

8 అసమానతలని సమానంగా పొందుపరచిన ‘చందమామ కథలు’

Published on Jan 20, 2014 12:00 PM IST

Chandamama
ఒక ప్రవక్త అన్నాడు, జీవితంలో జరిగే వరుస సంఘటనలు మనలో ఒక నమ్మకానికి దారి తీస్తాయి, ఒక్కసారి ఆ నమ్మకం నిజమని బలంగా విశ్వసిస్తే, ఆ నిజాన్ని బతికించడానికి ప్రపంచం నీకోసం సంభవిస్తుంది అని.
అయితే ఆ నమ్మకాన్ని ఎంత బలంగా నమ్మగలం? నమ్మిన దానికోసం ఎంత పనంగా పెట్టగలం,ఎంత దూరం వెళ్ళగలం? అంతర్లీనమైన ఈ నిరంతర మానసిక సంఘర్షణ తో పాటు అనంతమైన విశ్వంలో మన ఆధీనంలోనే ఉంది అనుకుంటున్న మన నలుసంత జీవితాన్ని ఒక రచయిత ద్వారా ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ “చందమామ కథలు”.
ఈ చిత్రం ఒక పవనం…మురికి వాడలనుంచి మహా సంపన్నుల వరకు,అమ్మయకత్వం నుంచి అహంకారం వరకు,పడుచు వయసు నుంచి పండు ముసలి వరకు సాగే ప్రయాణం… మనం రోజూ చూస్తూ గమనించని వ్యక్తుల జీవితాలని,రోజూ చేస్తూ దృష్టి పెట్టని పనుల పర్యవసానాన్ని ప్రతిస్పుఠిస్తూ, సమాజం లోని అందం,ఆశ,అబద్ధం,బంధం,బాంధవ్యం,నమ్మకం,మోసం,పేదరికం అనే ఎనిమిది అసమానతలని సమానంగా,అంతర్భాగంగా, అతిసహజంగా,ఆహ్లాదకరంగా పొందుపరిచిన వైనం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత.
మనం లోతుగా గమనించినట్లయితే ప్రచార చిత్రం లోని ఎనిమిది గడులు ఎనిమిది కథల మరియు పాత్రల దృశ్యరూపాలు అని స్పష్టం అవుతుంది, మన కళ్ళు మోసం చేసినట్టు గా మనల్ని ఇంకెవరు మోసం చేయరు అంటారు…నిజమే, మనకు కనపడుతోంది చాలా చాలా తక్కువ, కనపడని భావోద్వేగాలు ,కనిపిస్తూ కనిపించని మానవత్వాలు అన్నీ కలిపి…మనకు కనిపించబోయే ఈ “చందమామ కథలు”.

తాజా వార్తలు