సంక్రాంతి బరిలో మరో సినిమా

సంక్రాంతి బరిలో మరో సినిమా

Published on Dec 27, 2012 12:55 AM IST

Chammak-Challo
సంక్రాంతి రేసుకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నాయక్’ సినిమాలు సిద్ధమవుతుంటే ఈ రెండు భారీ సినిమాలతో పోటీ పడడానికి మరో సినిమా సిద్ధమవుతుంది. వరుణ్ సందేశ్, సంచితా పడుకొనే, కేథరిన్ తెరిసా కలిసి నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శైలేంద్ర మూవీస్ బ్యానర్ పై డి. ఎస్. రావు నిర్మించాడు. వరుణ్ సందేశ్ కి తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్న ఈ సినిమాలో షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, చిన్మయి, వెన్నెల కిషోర్, సురేఖా వాణి తదితరులు నటించారు. ఇదిలా ఉండగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ లాంటి రెండు భారీ సంక్రాంతికి విడుదలవుతుండగా చమ్మక్ చల్లో సినిమాకి థియేటర్స్ ఎలా దొరుకుతాయి అనేది ప్రశ్నార్ధకం.

తాజా వార్తలు