ఈ నెలాఖరున రానున్న చమ్మక్ చల్లో

ఈ నెలాఖరున రానున్న చమ్మక్ చల్లో

Published on Jan 14, 2013 1:40 PM IST

Chammak-Challo

ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిన నీలకంఠ ప్రస్తుతం లవ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ తీసిన సినిమా ‘చమ్మక్ చల్లో’. ట్రై యాంగిల్ లవ్ స్టొరీగా తెరకెక్కించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. సంచితా పదుకొనే, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్ర సమర్పకుడు డి.ఎస్ రావు మాట్లాడుతూ ‘ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా సాగే రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది. డైరెక్టర్ చాలా బాగా తీసారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని’ అన్నాడు. కమర్షియల్ హిట్స్ లేని నీలకంఠ – వరుణ్ సందేష్ లు ఈ సినిమా విజయం పైనే తమ ఆశలని పెట్టుకున్నారు.

తాజా వార్తలు