దర్శకుడు అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. హీరో శర్వానంద్ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించబోతుందట. అజయ్ ఇప్పటికే దివ్యాంశ కౌశిక్ కి కథ కూడా వివరించారట. దివ్యాంశ కౌశిక్ కూడా ఈ సినిమా చేయడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. ఉండక ఏం చేస్తుందిలే.. అమ్మడుకు అవకాశాలు పెద్దగా లేవు కదా.
ఇక ఈ సినిమాలోని మరో హీరో పాత్ర కోసం.. అజయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం అజేయ్ భూపతి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు.
కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.