సెంట్రల్ జైల్ సెట్లో బాద్షా

సెంట్రల్ జైల్ సెట్లో బాద్షా

Published on Oct 16, 2012 10:39 AM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోని సెంట్రల్ జైల్ సెట్లో వేసిన ఒక డాన్ సెట్ వేసారు. ప్రస్తుతం అందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మరియు ఇంకొన్ని రోజులు అక్కడే చిత్రీకరణ జరగనుంది. ‘బృందావనం’ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.

కోనా వెంకట్ మరియు గోపి మోహన్ కథ అందించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్.టి.ఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు