సెన్సార్ బోర్డ్ సలహా మండలి సమావేశం

సెన్సార్ బోర్డ్ సలహా మండలి సమావేశం

Published on Oct 15, 2012 9:30 AM IST


ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ చీఫ్ లీలా సామ్సన్ గారి ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డు సలాహాదారులతో ఒక మీటింగ్ జరుగుతోంది. దీనికి ‘సెన్సార్ బోర్డ్ సలహా మండలి సమావేశం’ అని పేరు పెట్టారు. ఈ సమావేశంలో ప్రస్తుతం లోకల్ సెన్సార్ బోర్డ్లో ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులను గురించి ఒక డిబేట్ జరుగుతోంది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖల చేత కూడా సెన్సార్ పనితనాన్ని గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. గత కొంత కాలంగా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ శ్రీమతి ధనలక్ష్మి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, వాటి గురించి ఈ మీటింగ్లో చర్చిస్తారా లేదా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని గత కొన్ని నెలలుగా పోరాటం జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో కట్స్ మరియు సర్టిఫికేట్ విషయంలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.

తాజా వార్తలు