ఎప్పుడూ ఒకేలా జడ్జ్ చేయడం కష్టమంటున్న సమంత

Samantha-in-saree

‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అందాల భామ సమంత ఎంతోమంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత సినిమాలతో వరుస విజయాలను అందుకుంటా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా సమంత తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

అందులో ఒక అభిమాని సెలబ్రిటీలకు బాగా కష్టమైన విషయం ఏమిటి? అని అడిగితే సమంత సమాధానమిస్తూ ‘మీరడిగిన ప్రశ్నకి కొన్ని వందల విషయాలను సమాధానంగా చెప్పగలను. నా మదిలో ముందుగా వచ్చే విషయం అయితే ప్రతిసారి ఒకేలా జడ్జ్ చేయడం. ఒక సెలబ్రిటీ ప్రతి రోజు ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలగాలి. కాని అది కాస్త కష్టమైన పని, ఎందుకంటే మేము మీలా మనుషులమే. మేము తప్పులు చేస్తాం, సరిదిద్దుకుంటాం, మేము కింద పడతాం, మళ్ళీ లేస్తాం. అందుకే ఒక మనిషికి ఎప్పుడూ పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయడం అనేది కష్టమని’ చెప్పింది.

సమంత ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’, అక్కినేని ఫ్యామిలీ ‘మనం’, వివి వినాయక్ సినిమాలు చేస్తోంది. ఇది కాకుండా తమిళంలో టాప్ హీరోలైన విజయ్, సూర్యలతో ఒక్కో సినిమా చేస్తోంది.

Exit mobile version